‘ఇట్లు అర్జున’ ఫస్ట్ సింగిల్ మే 28న రిలీజ్
స్టార్ డైరెక్టర్ వెంకీ కుడుముల తన నిర్మాణ సంస్థ వాట్ నెక్స్ట్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్న తొలి చిత్రం ‘ఇట్లు అర్జున’. “న్యూ గై ఇన్ టౌన్” అనీష్ హీరోగా పరిచయం అవుతుండగా, మహేష్ ఉప్పల దర్శకుడిగా అరంగేట్రం చేస్తున్నారు. అనస్వర రాజన్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం టైటిల్ గ్లింప్స్‌తోనే మంచి బజ్ క్రియేట్ చేసింది. అక్కినేని నాగార్జున ఇచ్చిన పవర్‌ఫుల్ వాయిస్ ఓవర్ గ్లింప్స్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అనంతరం విడుదలైన పోస్టర్లు, ‘ఫైండింగ్ అర్జున’ అనే స్పెషల్ వీడియో సినిమాపై మరింత ఆసక్తిని పెంచాయి. తాజాగా చిత్ర బృందం మ్యూజికల్ జర్నీకి శ్రీకారం చుడుతూ ఓ సరదా ప్రోమోను విడుదల చేసింది. పియానోపై ఓ ట్యూన్ వాయించేందుకు అనీష్…
