గ్యాంగ్ స్టర్ చిత్రాలకు సరికొత్త చిరునామాగా ‘టాక్సిక్’ – యశ్
లాస్ వెగాస్‌లో నిర్వహించిన సినిమాకాన్ 2026 కార్యక్రమంలో రాకింగ్ స్టార్ యశ్ సందడి చేశారు. ‘టాక్సిక్ : ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్’ గురించి వేదికపై యశ్ మాట్లాడిన మాటలు, చెప్పిన విషయాలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ‘రామాయణ’ సహ నిర్మాత నమిత్ మల్హోత్ర, యశ్ ఇద్దరూ కలిసి ‘టాక్సిక్’ గురించి ఎన్నో విషయాల్ని పంచుకున్నారు. గ్యాంగ్ స్టర్ జానర్ చిత్రాలకు ఇకపై అడ్రస్‌గా, గైడ్‌గా ‘టాక్సిక్’ ఉంటుందని అభివర్ణించారు. అంతర్జాతీయ వేదికపై.. యశ్ మాట్లాడుతూ.. ‘మొదటిసారిగా ఇంగ్లీష్‌లో మేం సినిమాని చిత్రీకరించాం. ‘టాక్సిక్’లో ఎన్నో లేయర్స్ ఉంటాయి. ఇది రెగ్యులర్ యాక్షన్, గ్యాంగ్ స్టర్ చిత్రం కాదు. పైకి చూస్తుంటే.. ఇదొక యాక్షన్, గ్యాంగ్ స్టర్ మూవీలా మాత్రమే కనిపిస్తుంది…
