‘రిస్క్’ అందరినీ అలరించే యూత్ ఫుల్ కమర్షియల్ ఎంటర్‌టైనర్: హీరో సందీప్ అశ్వ
సంపంగి,16 వంటి చిత్రాలకు చార్ట్ బస్టర్ మ్యూజిక్ అందించిన ఘంటాడి కృష్ణ స్వీయ సంగీత దర్శక నిర్మాణంలో రూపొందిన చిత్రం 'రిస్క్'. సందీప్ అశ్వ, సన్యా ఠాకూర్ ప్రధాన పాత్రలు పోషించారు. ఇప్పటికే విడుదలైన పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. జూన్ రెండో వారంలో ఈ సినిమా రిలీజ్ చేయడానికి సన్నాహలు చేస్తున్నారు. ఈ సందర్భంగా మేకర్స్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. ఎమ్మెల్సీ మధుసూదనాచారి ఈ వేడుకలో ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో ఎమ్మెల్సీ మధుసూదనాచారి మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. రిస్క్.. టైటిల్ చాలా బాగుంది. ట్రైలర్ చూసిన తర్వాత ఈ సినిమాను థియేటర్‌లో చూడాలని నిర్ణయించుకున్నాను. ఇది యువతకు బాగా నచ్చే సినిమా అనిపిస్తోంది. చిత్ర…
