‘కన్నప్ప’ బ్లాక్ బస్టర్ తరువాత వంద కోట్లతో మైక్రో డ్రామాల్ని సృష్టించనున్న విష్ణు మంచు
డివైన్ బ్లాక్ బస్టర్ ‘కన్నప్ప’ తరువాత విష్ణు మంచు చేయబోయే ప్రాజెక్టులు, సినిమాలపై అందరి దృష్టి పడింది. ‘కన్నప్ప’లో అద్భుతమైన నటనను కనబర్చిన విష్ణు మంచు మీద ఆడియెన్స్ ఎంతలా ప్రశంసలు కురిపించారో అందరికీ తెలిసిందే. ఇక విష్ణు ఇప్పుడు మైక్రో డ్రామాలపై వంద కోట్ల పెట్టుబడి పెట్టేందుకు నిర్ణయించుకున్నారని సమాచారం. ఇండస్ట్రీలో కొత్త ట్రెండ్‌ను క్రియేట్ చేసేందుకు విష్ణు మంచు ముందడుగు వేయబోతోన్నారు. మైక్రోడ్రామాలతో విష్ణు మిరాకిల్స్ చేయబోతోన్నారు. మూడు నుంచి ఏడు నిమిషాల వ్యవధితో సాగే ఎపిసోడ్స్‌ని మైక్రో డ్రామాలు అని చెప్పుకోవచ్చు. మొబైల్‌లో యూజర్స్‌కి సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్ ఇచ్చేలా వాటిని రూపొందించాలని విష్ణు నిర్ణయించుకున్నారు. సాధారణ రీల్స్ మాదిరిగా కాకుండా, పూర్తి స్థాయి నిర్మాణం, ప్రొఫెషనల్ దర్శకత్వం, ఎఫెక్టివ్…