Skip to content

G.O.A.T (గోట్) సినిమా ట్రైలర్‌ విడుదల చేసిన హీరో దుల్కర్‌ సల్మాన్‌

ప్రముఖ హాస్య కథానాయకుడు సుడిగాలి సుధీర్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం G.O.A.T (గోట్) GreatestOfAllTimes అనేది ఉపశీర్షిక. దివ్యభారతి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి వేదవ్యాస్‌ దర్శకుడు. మహాతేజ క్రియేషన్స్ అండ్ జైష్ణ‌వ్ ప్రొడ‌క్ష‌న్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి చంద్రశేఖర్ రెడ్డి మొగుళ్ళ నిర్మాత‌. ప్రముఖ నిర్మాణ సంస్థ ఏషియన్‌ సినిమాస్‌ సమర్పణలో ఈ చిత్రం నవంబరు 12న థియేట్రికల్‌ విడుదల కానుంది. ఇప్పటి వరకు ఈ చిత్రం నుంచి విడుదలైన ప్రతి కంటెంట్‌కు మంచి స్పందన వస్తోంది. కాగా ఈ చిత్రం ట్రైలర్‌ను ప్రముఖ కథానాయకుడు దుల్కర్‌ సల్మాన్‌ తన సోషల్‌ మీడియా వేదికగా విడుదల చేసి.. చిత్ర టీమ్‌కు శుభాకాంక్షలు అందజేశారు.. నిర్మాత మాట్లాడుతూ ''సుడిగాలి సుధీర్‌…

Read more

‘రామాయణం’ సినిమా పై ప్రశంసలు కురిపించిన ఎస్ ఎస్ రాజమౌళి

‘రామాయణం’ థియేటర్లలోకి రావడంతో ప్రేక్షకుల్లో భారీ ఆసక్తి నెలకొంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం అన్ని వర్గాల నుంచి అద్భుతమైన స్పందనను అందుకుంటోంది. గ్రాండ్ స్టోరీటెల్లింగ్, నటీనటుల అద్భుతమైన పెర్ఫార్మెన్స్‌లు, సాంకేతిక విలువలపై ప్రేక్షకులు, విమర్శకులు ప్రశంసలు కురిపిస్తున్నారు. తాజాగా దర్శక ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి ఈ సినిమాపై ప్రశంసలు కురిపించడం చిత్రానికి మరింత ప్రత్యేకతను తీసుకొచ్చింది. భారతీయ సినిమాను తనదైన భారీ కథాకథనాలతో కొత్త స్థాయికి తీసుకెళ్లిన రాజమౌళి.. నితేశ్ తివారీ తెరకెక్కించిన ఈ ప్రతిష్ఠాత్మక ఎపిక్ చిత్రాన్ని ప్రత్యేకంగా అభినందించారు. ముఖ్యంగా సినిమా భారీ స్థాయి, బిగ్ స్క్రీన్‌పై విజువల్స్ అద్భుతంగా ఉన్నాయని ప్రశంసించారు. ఈ సినిమా అందించే గ్రాండ్ సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్‌ను కొనియాడుతూ ఎక్స్ వేదికగా…

Read more

శరవేగం గా షూటింగ్ జరుపుకుంటున్న వెంకటేష్, కళ్యాణ్ రామ్, అనిల్ రావిపూడి కాంబో ‘జనవరి 12 విడుదల’

విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్ కాంబినేషన్ లో హిట్ మిషన్ అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న మోస్ట్ అవైటెడ్ మల్టీస్టారర్ ‘జనవరి 12 విడుదల’ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్, శ్రీమతి అర్చన, జీ స్టూడియోస్ సమర్పిస్తున్నాయి. కీర్తి సురేష్, కృతి శెట్టి కథానాయికలుగా నటిస్తున్నారు. ‘బావ బామ్మర్ది సౌజన్యంతో’ అనే ఆసక్తికరమైన ట్యాగ్‌లైన్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా ఫ్యామిలీ ఎమోషన్స్, హ్యూమర్, కమర్షియల్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో కంప్లీట్ ప్యాకేజీగా అలరించనుంది. తాజాగా చిత్ర బృందం కజకిస్థాన్‌లో కొత్త షెడ్యూల్‌ను ప్రారంభించింది. ఈ షెడ్యూల్ కోసం దర్శకుడు అనిల్ రావిపూడి యాక్షన్, పాటల కలయికతో ప్రత్యేకమైన ప్లాన్ సిద్ధం చేశారు…

Read more

“సమ్మర్ హాలిడేస్” సినిమా ప్రతి ఒక్కరికీ నచ్చుతుంది – రోహన్ రాయ్, అరుణ్

కథా బలమున్న చిత్రాలను ప్రేక్షకులకు అందిస్తూ సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ గా, డిస్ట్రిబ్యూటర్ గా పేరు తెచ్చుకున్నారు ధీరజ్ మొగిలినేని. ఆయన తన ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై "సమ్మర్ హాలిడేస్" అనే చిల్డ్రన్ మూవీని నిర్మిస్తున్నారు. "సమ్మర్ హాలిడేస్" సినిమాను మన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుచేసే ఒక అందమైన కథతో దర్శకుడు శ్రీకర్ రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో మాస్టర్ రోహన్, మాస్టర్ అరుణ్, బేబి ఖుషి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ నెల 6న "సమ్మర్ హాలిడేస్" సినిమా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తోంది. ఈ రోజు జరిగిన ఇంటర్వ్యూలో మూవీ హైలైట్స్ తెలిపారు రోహన్, అరుణ్. అరుణ్ మాట్లాడుతూ ---------------------------------------------- - నేను 8…

Read more

నవంబర్ 6 నుండి హిందీ జీ5లో స్ట్రీమింగ్ కానున్న”లాస్ట్ మ్యాన్ ఇన్ టవర్”

అభివృద్ధి చెందుతోన్న నగరంతో పాటు ఎన్నో మార్పులు చోటు చేసుకుంటాయి. ఎంత మారినా కూడా కొన్నింటిని వదులుకోవడం మాత్రం అంత సులభం కాదు. ముఖ్యంగా మనకు ఎంతో అనుబంధం ఉన్న ఇంటిని వదిలిపెట్టడం మరింత కష్టం. ఇలాంటి ఆసక్తికరమైన కథాంశంతో తెరకెక్కిన చిత్రమే ‘లాస్ట్ మ్యాన్ ఇన్ టవర్’. మనోజ్ బాజ్‌పాయ్, బోమన్ ఇరానీ, దివ్య దత్తా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ఓ రిటైర్డ్ టీచర్ చుట్టూ తిరుగుతుంది. ముంబైలోని ఓ అపార్ట్‌మెంట్‌లో నివసించే ఆయన.. ఆ భవనాన్ని పునర్నిర్మించేందుకు (రీడెవలప్‌మెంట్) భారీ మొత్తంలో డబ్బు ఇస్తామన్న ఆఫర్ వచ్చినా ఇల్లు ఖాళీ చేయడానికి అంగీకరించడు. తనకు ఎంతో ఇష్టమైన ఇంటిని కాపాడుకోవడం కోసం ఏకంగా ఆ హౌసింగ్ సొసైటీలోని…

Read more

లగడపాటి శ్రీధర్ చేతుల మీదుగా “యద్భావం తద్భవతి” చిత్ర టీజర్ విడుదల & నవంబర్ 27న థియేటర్లలో విడుదల

రమేష్ జక్కల దర్శకత్వంలో ప్రసన్న లక్ష్మి భూమిరెడ్డి నిర్మాతగా ప్రసన్న భూమి ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ప్రేక్షకుల ముందుకు రానున్న చిత్రం "యద్భావం తద్భవతి". వరుణ్ సందేశ్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో ఇనయ సుల్తానా, రేణు శ్రీ హీరోయిన్స్ గా నటిస్తుండగా సుమన్, నాగ మహేష్, లోహిత్ కుమార్, ధనరాజ్, శ్వేత వర్మ, దయానంద్ రెడ్డి, శ్రీకాంత్ అయ్యంగర్ తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. శ్యామ్ సినిమాటోగ్రఫీ చేసిన ఈ చిత్రానికి మిహిరామ్ సంగీతం అందించగా ఈ చిత్ర పాటలను కే మ్యూజిక్ ద్వారా చిత్ర బృందం విడుదల చేస్తుంది. విడుదలకు సిద్ధమవుతున్న సందర్భంగా "యద్భావం తద్భవతి" చిత్ర టీజర్ ను ప్రముఖ చిత్ర నిర్మాత లగడపాటి శ్రీధర్ గారి చేతుల మీదగా…

Read more

#బాలుగీత సినిమా డిసప్పాయింట్ చేయదు: నిర్మాత సుప్రియ యార్లగడ్డ

అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై సుప్రియ యార్లగడ్డ నిర్మించిన చిత్రం #బాలుగీత. సందీప్ సరోజ్, కేయురి, హీరో హీరోయిన్స్ గా నటించిన ఈ మూవీకి ప్రతాప్ కొల్లారెడ్డి దర్శకత్వం వహించారు. ఆనంద్ రెడ్డి కర్నాటి, హరీష్ కోహిర్కర్ సహా నిర్మాతలు. నవంబర్ 5 నుంచి ఈ చిత్రం ETV Winలో ప్రీమియర్ కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ప్రెస్‌మీట్‌లో నిర్మాత సుప్రియ యార్లగడ్డ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం.చిన్న సినిమా అంటాం కానీ, చాలా పెద్ద కథ. ఈ కథ చెప్పినప్పుడు ఎలాగైనా సరే దీన్ని సినిమాగా తీయాలి అనిపించింది. అందరూ రిలేట్ అయ్యే కథ ఇది. చాలామంది జీవితాల్లో ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగి ఉంటాయి. ETV అనేది మంచి…

Read more

‘వృషకర్మ’ ఫస్ట్ సింగిల్ 7న రిలీజ్

యువ సామ్రాట్ నాగచైతన్య ప్రతిష్టాత్మక మైథలాజికల్ థ్రిల్లర్ ‘వృషకర్మ’ ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 4న థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. కార్తీక్ దండు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందించనుంది. ఎస్‌వీసీసీ, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై రూపొందుతున్న ఈ చిత్రాన్ని బాపినీడు సమర్పిస్తున్నారు. భారీ స్థాయిలో తెరకెక్కుతున్న ‘వృషకర్మ’ ప్రేక్షకులకు గొప్ప థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్‌ను అందించేందుకు సిద్ధమవుతోంది. తాజాగా ‘వృషకర్మ’ మ్యూజికల్ జర్నీ మొదలుపెడుతున్నారు మేకర్స్. ఫస్ట్ సింగిల్ స్వాగ్ ఆఫ్ అర్జున్ నవంబర్ 7న రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా విడుదల చేసిన అనౌన్స్‌మెంట్ పోస్టర్ ఆసక్తిని పెంచుతోంది. నాగచైతన్య సైడ్ ప్రొఫైల్‌లో బ్లాక్ గాగుల్స్, ఇయర్‌ఫోన్స్‌తో చాలా ఇంటెన్స్ లుక్‌లో కనిపిస్తున్నారు. భుజంపై గాయం, డార్క్ బ్యాక్‌డ్రాప్ పోస్టర్‌కు…

Read more

ఎన్టీఆర్ లాంచ్ చేసిన ‘ఇట్లు అర్జున’ ట్రైలర్‌

కింగ్ నాగార్జున సమర్పణలో తెరకెక్కుతున్న ‘ఇట్లు అర్జున’ చిత్రంతో కొత్త హీరో అనీష్ కథానాయకుడిగా పరిచయం అవుతున్నారు. మహేష్ ఉప్పల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని వాట్ నెక్స్ట్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై వెంకీ కుడుముల నిర్మిస్తున్నారు. అనస్వర రాజన్ కథానాయికగా నటిస్తున్నారు. ఇప్పటికే గ్లింప్స్, టీజర్, పాటలతో మంచి బజ్ క్రియేట్ చేసిన మేకర్స్ తాజాగా ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేశారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేసి చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎక్స్‌ వేదికగా ఆయన స్పందిస్తూ.. “ ఒక్క మాట కూడా మాట్లాడకుండా డెబ్యూ సినిమాతోనే అందరి దృష్టిని ఆకర్షించడం అనీష్ రియల్ గట్స్ కి నిదర్శనం. నీ…

Read more

2 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లు సాధించిన “కిల్లర్”

ఫ్యాన్సీ ప్రైస్ కు "కిల్లర్" సినిమా ఓటీటీ హక్కులు పొందిన ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ స్ట్రాంగ్ కంటెంట్ ఉంటే చిన్న చిత్రాలు కూడా పెద్ద విజయం సాధించగలవు అని మరోసారి ప్రూవ్ చేసింది "కిల్లర్". ఈ సెన్సేషనల్ సై ఫై థ్రిల్లర్ ప్రీమియర్స్ తో కలిపి థియేట్రికల్ గా 2 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లు సాధించింది. "కిల్లర్" సినిమా సాధించిన విజయం ప్రముఖ ఓటీటీ సంస్థల దృష్టిని ఆకర్షించింది. ఈ నేపథ్యంలో ఒక ప్రముఖ ఓటీటీ సంస్థ ఈ చిత్ర ఓటీటీ హక్కులను ఫ్యాన్సీ ప్రైస్ కు సొంతం చేసుకుంది. ఒక చిన్న సినిమా థియేట్రికల్ రిలీజ్ తర్వాత ఫ్యాన్సీ ప్రైస్ తో ఔట్ రైట్ గా ఒక పెద్ద…

Read more