Skip to content

తెలుగు టెలివిషన్ 24 క్రాఫ్ట్స్ తో ఏపీ ఎఫ్డిసి చైర్మన్ భరత్ భూషణ్ చర్చలు

ఆంధ్రప్రదేశ్ సినీ, టీవీ, నాటక రంగాల నంది అవార్డులకు సంబంధించి ఇటీవల ఏపీ ఎఫ్డిసి నుండి ప్రకటన వచ్చిన విషయం అందరికీ తెలిసిందే. దీనికి సంబంధించి ఏపీ ఎఫ్డిసి చైర్మన్ భరత్ భూషణ్ గారు, ఎఫ్డిసి సభ్యులు బుర్ర సాయి మాధవ్ గారు, మీర్ గారు, టివి & ఓటీటీ సౌత్ ప్రెసిడెంట్ ప్రసాద్ రావు గారు, టీవీ ఫెడరేషన్ ప్రెసిడెంట్ నాని గారు, తెలుగు చిత్ర నిర్మాతల మండలి సెక్రటరీ తుమ్మల ప్రసన్న కుమార్ గారు, టీవీ రంగానికి చెందిన 24 క్రాఫ్ట్స్ వ్యక్తులతో చర్చలు జరపడం జరిగింది. ఈ చర్చలలో భరత్ భూషణ్ గారు గత కొన్ని సంవత్సరాలుగా నిలిచిపోయిన నంది అవార్డులను త్వరలోనే అందజేస్తామని తెలిపారు. 2017 నుండి…

Read more

శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో ఎస్‌వీబీసీ అద్భుత సేవలు

ప్రతి క్షణం లైవ్‌ కార్యక్రమాలతో భక్తులను అలరించిన ఎస్‌వీబీసీ ఈ కార్యక్రమాలకు సహకరించిన అందరికీ కృతజ్ఞతలు.. ఈ సేవల్లో భాగం కావడం పూర్వజన్మ సుకృతం ఎస్‌వీబీసీ ఛానల్‌ ఛైర్మన్‌ శ్రీధర్‌ వర్మ.. తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ఈ నెల 15.09.2026 నుంచి 23.09.2026 వరకు తొమ్మిది రోజులపాటు అత్యంత వైభవంగా నిర్వహించిన సంగతి తెలిసిందే! శ్రీవారి దర్శనం కోసం లక్షలాది మంది భక్తులు బారులు తీరారు. స్వామికి జరిగే కైంకర్యాలను ప్రత్యక్షంగా భక్తులకు చూపించి భక్తులను తరింపజేయడంతో ఎస్‌వీబీసీ ఛానల్‌ వందశాతం సక్సెస్‌ అయిందని చైర్మన్‌ శ్రీధర్‌ వర్మ అన్నారు. ఈ మేరకు కార్యక్రమాలు నిర్వహించడంతో సహకరించిన ప్రతి ఒక్కరికీ శ్రీధర్‌వర్మ కృతజ్ఞతలు తెలిపారు. ఆయన మాట్లాడుతూ ‘తొమ్మిది రోజులపాటు బ్రహోత్సవాలు…

Read more

‘హాయ్’ సెప్టెంబర్ 25 నుంచి తమిళ జీ5లో స్ట్రీమింగ్

నయనతార, కవిన్ ప్రధాన పాత్రధారులుగా నేటితరం ప్రేమ, ఆధునిక సంబంధాలు, సంక్లిష్టతలను ఆసక్తికరంగా ఆవిష్కరించిన‌ చిత్రం భారతదేశంలోని అగ్రశ్రేణి సూపర్‌స్టార్స్‌ నటించిన పలు బ్లాక్‌బస్టర్ చిత్రాలను ప్రేక్షకులకు అందించిన త‌మిళ జీ5 తన విజయ పరంపరను కొనసాగిస్తోంది. ‘జననాయగ‌న్’కు లభించిన అద్భుతమైన స్పందన తర్వాత, ఇప్పుడు నయనతార, కవిన్ నటించిన ‘హాయ్’ చిత్రంతో ప్రేక్ష‌కుల‌ను అల‌రించ‌టానికి సిద్ధ‌మ‌వుతోంది. విభిన్నమైన ప్రేమకథగా తెరకెక్కిన ఈ చిత్రం.. నేటితరం సంబంధాలను సరికొత్త కోణంలో ఆవిష్కరిస్తూ, హృదయాన్ని హత్తుకునే ప్రేమకథగా అలరించనుంది. నయనతార, కవిన్ ప్రధాన పాత్రల్లో నటించిన ‘హాయ్’ చిత్రం.. నేటితరం సంబంధాలు, ప్రేమను హృదయానికి హత్తుకునేలా, భావోద్వేగంగా ఆవిష్కరిస్తుంది. న‌య‌న్‌, కవిన్ ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలవగా.. తెరపై వారి కెమిస్ట్రీ కథకు…

Read more

‘లవ్ & వార్’ నుండి ఆకట్టుకుంటున్న అలియాభట్ ఫస్ట్ లుక్

రణబీర్ కపూర్ ఫస్ట్ లుక్‌ను విడుదల చేసిన తర్వాత సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కిస్తున్న ‘లవ్ & వార్’ చిత్రంలో అలియా భట్ ఫస్ట్ లుక్‌ను మేకర్స్ తాజాగా విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో అలియా ఇంతకుముందెన్నడూ కనిపించని గ్లామరస్ లుక్‌లో మెరిసింది. 2027లో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాల్లో ‘లవ్ & వార్’ ఒకటి. ఈ సినిమాలో సంజయ్ లీలా భన్సాలీ తన గత చిత్రాలకు భిన్నమైన ఆధునిక ప్రపంచాన్ని చూపించబోతున్నారు. మేకర్స్ సోషల్ మీడియాలో అలియా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. విడుదలైన ఈ పోస్టర్‌లో అలియా స్లిట్ స్కర్ట్, ప్రత్యేకమైన హెడ్‌పీస్‌తో కుర్చీలో కూర్చుని కనిపించింది. ఆమె లుక్, స్టైలింగ్, హావభావాలు రెట్రో ఫీల్‌ను అందిస్తున్నాయి. ఈ…

Read more

అక్టోబర్ 2న హిందీ జీ5లో ప్రీమియర్ కానున్న ‘పూజా మేరీ జాన్’

ప్రతి కథ కూడా సులభంగా అందరికీ అర్థమైయ్యేలా ఉండ‌దు. కొన్ని కథలు మనల్ని అసౌకర్యానికి గురిచేస్తాయి.. మనం సహజంగా అంగీకరించే విషయాలను కూడా ఆ క‌థ‌లు ప్రశ్నించేలా చేస్తాయి.. చూడకూడదనుకునే నిజాలను ఎదుర్కొనేలా మ‌న‌ల్ని సిద్ధం చేస్తాయి. అలాంటి క‌థే ‘పూజా మేరీ జాన్’. నవ్‌జోత్ గులాటి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని దినేశ్ విజన్, అమర్ కౌశిక్ నిర్మించారు. మ్యాడాక్ ఫిలిమ్స్‌ బ్యానర్‌పై తెరకెక్కిన ‘పూజా మేరీ జాన్’ అక్టోబర్ 2, 2026న హిందీ జీ5లో ప్రీమియర్ కానుంది. బ‌ల‌మైన ఇన్‌టెన్స్ డ్రామాగా తెర‌కెక్కిన ఈ చిత్రం.. పూజా చుట్టూ చోటుచేసుకునే కలవరపరిచే ఘటనల నేపథ్యంలో సాగుతుంది. తిరస్కరణ, వ్యామోహం, నిజాన్ని అంగీక‌రించ‌టం, అసలు ఏం జరిగిందనే నిజం వంటి అంశాలపై…

Read more

“చకోర – Lunar Love Bird” సినిమా నుంచి ‘శివ ట్రాన్స్..’ వీడియో సాంగ్ రిలీజ్

అక్టోబర్ 9న వరల్డ్ వైడ్ రిలీజ్ కాబోతున్న "చకోర – Lunar Love Bird" మూవీ High Joy Commercials బ్యానర్‌ పై డా. చింతాడ హేమారావు నిర్మాతగా, VIP – Vintage Iconic Pictures నిర్మాణ సారథ్యంలో మంగా శ్రీనివాస్ రచన- దర్శకత్వంలో రూపొందిన మాస్ పోయెట్రీ మ్యూజికల్ లవ్ స్టోరీ "చకోర – Lunar Love Bird". శ్రవణ్, మలైకా టి. వాసుపల్‌ ను సరికొత్త ప్రేమ జంటగా పరిచయం చేస్తూ తెరకెక్కిన ఈ ప్రేమ కథ చిత్రం శ్రీ లక్ష్మి పిక్చర్స్ ద్వారా అక్టోబర్ 9న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ రోజు ఈ సినిమా నుంచి 'శివ ట్రాన్స్..' వీడియో…

Read more

‘సిగ్మా’ ఫ్యామిలీ అందరితో కలిసి హ్యాపీగా చూసే సినిమా: ఫారియా అబ్దుల్లా

సందీప్ కిషన్ యాక్షన్-అడ్వెంచర్ హీస్ట్ కామెడీ ఎంటర్టైనర్ ‘సిగ్మా’. ఈ సినిమాతో జేసన్ సంజయ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఫారియా అబ్దుల్లా హీరోయిన్. ప్రతిష్టాత్మక లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సుభాస్కరన్ నిర్మించిన ఈ చిత్రంపై ప్రమోషనల్ కంటెంట్‌తో హ్యుజ్ బజ్ క్రియేట్ చేస్తోంది. కోస్తాంధ్ర, తెలంగాణలో మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ లిమిటెడ్ ఈ చిత్రాన్ని విడుదల చేస్తుండగా, సీడెడ్ ప్రాంతంలో ఎన్వీఆర్ సినిమా విడుదల చేస్తుంది. అక్టోబర్ 2న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా హీరోయిన్ ఫారియా అబ్దుల్లా విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు. సిగ్మా జర్నీ గురించి? -సిగ్మా నా ఫస్ట్ తమిళ్ సినిమా. లైకా లాంటి పెద్ద ప్రొడ్యూసర్స్ బ్యానర్‌లో అవకాశం రావడం చాలా హ్యాపీగా ఉంది…

Read more

‘జార్జ్ క్రిష్’ హ్యూమర్‌ ప్యాక్డ్ ఫస్ట్ బూస్టర్ రిలీజ్

వరుసగా రెండు హిట్లు కొట్టిన చార్మింగ్ స్టార్ శర్వా, శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'జార్జ్ క్రిష్'తో హ్యాట్రిక్ హిట్ పూర్తి చేయడానికి సిద్ధమవుతున్నాడు. అనిల్ సుంకర ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ఏటీవీ సమర్పిస్తుండగా, అజయ్ సుంకర సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. వినోదాత్మక ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో శర్వా సరసన మానస వారణాసి కథానాయికగా నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. దర్శకుడు శ్రీను వైట్ల పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ ‘జార్జ్ క్రిష్’ ఫస్ట్ బూస్టర్‌ను విడుదల చేశారు. శ్రీను వైట్ల సినిమాల నుంచి ప్రేక్షకులు ఆశించే హ్యూమర్, ఫన్ ఈ బూస్టర్‌లో పుష్కలంగా కనిపించింది. ఇందులో శర్వానంద్‌ను రెండు…

Read more

“మత్స్య” గ్లింప్స్ రిలీజ్

యంగ్ టాలెంటెడ్ హీరో వివస్వాన్ నటిస్తున్న ఫోక్ లోర్ అడ్వెంచర్ ఫిలిం "మత్స్య". ఈ చిత్రంతో వివస్వాన్ టాలీవుడ్ లోకి అడుగుపెడుతున్నారు. ఈ చిత్రాన్ని జి.బి.ఆర్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై సంహిత గణపతి ఇంటూరి నిర్మిస్తున్నారు. రవి గోలి, తేజ కనకాల దర్శకత్వం వహిస్తున్నారు. ఈ రోజు "మత్స్య" సినిమా అఫీషియల్ గ్లింప్స్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ గ్లింప్స్ టాప్ క్వాలిటీ విజువల్స్, వీఎఫ్ఎక్స్ తో ఒక కొత్త సినిమాటిక్ వరల్డ్ ను పరిచయం చేసింది. 'అమ్మా కొత్త బెడ్ టైమ్ కథ చెప్పమ్మా..! అంటూ బాబు అమ్మను అడగగా, ఒక ఫిష్ కథ చెప్పనా అంటూ అమ్మ చెప్పే డైలాగ్ తో "మత్స్య" గ్లింప్స్ మొదలవుతుంది. ఎన్నో వింతలు,…

Read more

‘లవ్ & వార్’ రణ్‌బీర్ కపూర్ ఫస్ట్ లుక్‌ విడుదల

సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘లవ్ & వార్’ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రణ్‌బీర్ కపూర్, అలియా భట్, విక్కీ కౌశల్ వంటి ముగ్గురు స్టార్ హీరోహీరోయిన్లు కలిసి నటిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన రణ్‌బీర్ కపూర్ ఫస్ట్ లుక్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఇందులో రణ్‌బీర్ పూర్తిగా కొత్త లుక్‌లో కనిపిస్తూ ఆకట్టుకుంటున్నారు. సంజయ్ లీలా భన్సాలీ సినిమాల్లో కనిపించే గ్రాండ్ విజువల్స్, రిచ్‌నెస్ ఈ పోస్టర్‌లోనూ స్పష్టంగా కనిపిస్తున్నాయి. రణ్‌బీర్ ఇప్పటివరకు కనిపించని కొత్త అవతార్‌లో కనిపించడం సినిమాపై ఆసక్తిని మరింత పెంచుతోంది. పోస్టర్‌కు జత చేసిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కూడా విజువల్స్‌కు…

Read more