Skip to content

‘సిటీ ఆఫ్ గోల్డ్’ ఫస్ట్ లుక్ మిస్టీరియస్ గ్లింప్స్ రిలీజ్

మోస్ట్ ట్యాలెంటెడ్ విక్రమ్ ప్రభు 26వ చిత్రం 'సిటీ ఆఫ్ గోల్డ్'. ఈ చిత్రానికి సిద్ధార్థ్ దర్శకత్వం వహించారు. విక్రమ్ ప్రభు సరసన శివత్మిక రాజశేఖర్ కథానాయికగా నటిస్తుండగా, ఇంటర్నెట్ సంచలనం అమలా షాజీ ముఖ్య పాత్రలలో కనిపిస్తున్నారు. రోమియో పిక్చర్స్ బ్యానర్ పై రాహుల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్, గ్లింప్స్ విడుదలయ్యాయి. విడుదలైన కొద్దిసేపటికే మంచి స్పందన లభించింది. ఫస్ట్ లుక్‌లో విక్రమ్ ప్రభు ఎంతో ఇంటెన్స్ లుక్‌తో కూర్చుని.. చాలా క్యాజువల్‌గా బంగారు కడ్డీలను పైకి విసురుతూ పట్టుకుంటూ కనిపించారు. బంగారం విలువతో పాటు దాని చుట్టూ ఉన్న మిస్టీరియస్ ప్రపంచాన్ని కలిపి చూపించిన ఈ విజువల్ ఆసక్తిని పెంచుతోంది. గ్లింప్స్ ప్రేక్షకులను మరింత…

Read more

“చకోర” సినిమా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్

అక్టోబర్ 9న వరల్డ్ వైడ్ రిలీజ్ కాబోతున్న "చకోర – Lunar Love Bird" మూవీ High Joy Commercials బ్యానర్‌ పై డా. చింతాడ హేమారావు నిర్మాతగా, VIP – Vintage Iconic Pictures నిర్మాణ సారథ్యంలో మంగా శ్రీనివాస్ రచన- దర్శకత్వంలో రూపొందిన మాస్ పోయెట్రీ మ్యూజికల్ లవ్ స్టోరీ "చకోర – Lunar Love Bird". శ్రవణ్, మలైకా టి. వాసుపల్‌ ను సరికొత్త ప్రేమ జంటగా పరిచయం చేస్తూ తెరకెక్కిన ఈ ప్రేమ కథ చిత్రం శ్రీ లక్ష్మి పిక్చర్స్ ద్వారా అక్టోబర్ 9న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ రోజు హీరో ఆకాష్ జగన్నాథ్ అతిథిగా ఈ సినిమా…

Read more

‘లవ్ అండ్ వార్’ నుండి విక్కీ కౌశల్ ఇంటెన్స్ ఫస్ట్ లుక్ విడుదల

సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘లవ్ అండ్ వార్’ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. రణ్‌బీర్ కపూర్, అలియా భట్, విక్కీ కౌశల్ తొలిసారి కలిసి నటిస్తున్న ఈ చిత్రం భారతీయ సినీ పరిశ్రమలో ప్రత్యేక చిత్రంగా నిలిచేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే రణ్‌బీర్ కపూర్, అలియా భట్ ఫస్ట్ లుక్ పోస్టర్లను విడుదల చేసిన చిత్రబృందం నేడు తాజాగా విక్కీ కౌశల్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేసింది. ఈ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పోస్టర్‌లో విక్కీ కౌశల్ సిగరెట్, లైటర్‌తో కనిపిస్తూ ఎంతో ఇంటెన్స్‌గా చూస్తున్న తీరు ఆకట్టుకుంటోంది. ఇప్పటివరకు చూడని విభిన్నమైన లుక్‌లో విక్కీ కనిపించడం విశేషం. ఆయన లుక్‌లో…

Read more

వరుస ప్రాజెక్ట్‌లతో దూసుకుపోతోన్న హీరో కౌశిక్ మేకల

‘ప్రియురాలు’, ‘సిట్(ZEE5)’ వంటి ప్రాజెక్ట్‌లతో అందరినీ ఆకట్టుకున్న యువ నటుడు కౌశిక్ మేకల. యంగ్ టాలెంటెడ్ ఆర్టిస్టులు ప్రస్తుతం కొత్త కొత్త ప్రాజెక్టులు, డిఫరెంట్ కంటెంట్‌తో ఆడియెన్స్‌ని అలరిస్తున్నాడు. ఈ క్రమంలో యంగ్ హీరో కౌశిక్ ఇప్పటికే పలు ప్రాజెక్ట్‌లతో ప్రేక్షకులపై ముద్ర వేశాడు. ప్రస్తుతం ‘పార్ట్ టైమర్స్’ అనే వెబ్ సిరీస్‌లో హీరోగా పోషించి అందరినీ ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం ఈ సిరీస్ సక్సెస్ ఫుల్‌గా దూసుకుపోతోంది. నాగార్జున, ఎన్టీఆర్‌లు చేసిన యాడ్స్‌లోనూ కౌశిక్ మెరిశాడు. సిరీస్‌లు, సినిమాలు, ప్రకటనలు అంటూ కౌశిక్ ఫుల్ బిజీగా ఉన్నారు. అలాంటి కౌశిక్ వరుసగా సినిమాల్ని లైన్లో పెట్టారు. కౌశిక్ కీలక పాత్రలో నటించిన "వైరల్ వీడియో" అనే చిత్రం రిలీజ్ కి రెడీగా ఉంది…

Read more

‘సిగ్మా’ ఖచ్చితంగా సూపర్ హిట్ అవుతుందని నమ్ముతున్నాను: చిరంజీవి

సందీప్ కిషన్ యాక్షన్-అడ్వెంచర్ హీస్ట్ కామెడీ ఎంటర్టైనర్ ‘సిగ్మా’. ఈ సినిమాతో జేసన్ సంజయ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఫారియా అబ్దుల్లా హీరోయిన్. ప్రతిష్టాత్మక లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సుభాస్కరన్ నిర్మించిన ఈ చిత్రంపై ప్రమోషనల్ కంటెంట్‌తో హ్యుజ్ బజ్ క్రియేట్ చేస్తోంది. కోస్తాంధ్ర, తెలంగాణలో మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ లిమిటెడ్ ఈ చిత్రాన్ని విడుదల చేస్తుండగా, సీడెడ్ ప్రాంతంలో ఎన్వీఆర్ సినిమా విడుదల చేస్తుంది. అక్టోబర్ 2న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా మేకర్స్ ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిధిగా హాజరైన ఈ వేడుక చాలా గ్రాండ్ గా జరిగింది. ప్రీరిలీజ్ ఈవెంట్ లో మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ...అందరికీ నమస్కారం. నేను నేరుగా కాకా షూటింగ్…

Read more

‘గరివిడి లక్ష్మి’ నుంచి కొండ కోన కోరసు పాడే సాంగ్ రిలీజ్

భారీ స్థాయి సినిమాలతో అలరించే పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌కి చెందిన లెజెండరీ జానపద గాయని గరివిడి లక్ష్మి కథని ప్రేక్షకులు ముందుకు తీసుకొస్తుంది. గరివిడి లక్ష్మి పాత్రలో ఆనంది మెరుస్తోంది. గౌరి నాయుడు జమ్ము ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. బుర్రకథలు చెప్పడమే కాదు, ఓ ఉద్యమంగా మార్చిన లక్ష్మి జీవితాన్ని ఈ సినిమా ఆవిష్కరించనుంది. టీజీ విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మిస్తున్న ‘గరివిడి లక్ష్మి’ ఓ పాటతో వేలాది హృదయాల్లో నిలిచిపోయిన లెజెండరీ జానపద గాయని జీవితాన్ని రిక్రియేట్ చేస్తోంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా కొండ కోన కోరసు పాడే సాంగ్ రిలీజ్ చేశారు. ఈ…

Read more

మెగాస్టార్ చిరంజీవి ‘కాకా’ డబ్బింగ్ ప్రారంభం

బ్లాక్‌బస్టర్ ‘వాల్తేరు వీరయ్య’ తర్వాత మెగాస్టార్ చిరంజీవి, సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ బాబీ కొల్లి మరోసారి కలిసి చేస్తున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘కాకా’. కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వెంకట్ కే నారాయణ నిర్మిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలను నెలకొల్పుతోంది. చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన టైటిల్ గ్లింప్స్‌కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ‘కాకా’ డబ్బింగ్ పనులు పూజా కార్యక్రమంతో ప్రారంభమయ్యాయి. షూటింగ్‌తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా ఏకకాలంలో శరవేగంగా జరుగుతున్నాయి. THE BLOODY BENCHMARK సెట్ చేసేందుకు చిత్ర బృందం ఫుల్ స్పీడ్‌లో వర్క్ చేస్తోంది. ఈ చిత్రంలో అనస్వర రాజన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఎస్. థమన్ సంగీతం అందిస్తుండగా, విజయ్ కార్తీక్ కన్నన్…

Read more

‘కల్కి’ సీక్వెల్ రెగ్యులర్ షూటింగ్ అక్టోబర్‌లో ప్రారంభం- 2027 మిడ్‌కి ప్రొడక్షన్ పూర్తి

రెబల్ స్టార్ ప్రభాస్‌ ఎపిక్ సైన్స్ ఫిక్షన్ మైథలాజికల్ ఎక్స్‌ట్రావెగాంజా ‘కల్కి 2898 ఏడీ’ కోసం క్రియేటివ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ సృష్టించిన ప్రపంచం ఇప్పుడు మరింత భారీ స్థాయిలో విస్తరించబోతోంది. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సీక్వెల్ రెగ్యులర్ షూటింగ్‌ను ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది. ప్రతిష్ఠాత్మక వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై అశ్వినీదత్ నిర్మిస్తున్న ఈ సీక్వెల్‌లో ప్రభాస్ మరోసారి అలరించబోతున్నారు. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ కూడా కీలక పాత్రల్లో కొనసాగనున్నారు. తొలి భాగం అద్భుతమైన బ్లాక్‌బస్టర్‌గా నిలవడంతో పాటు ప్రేక్షకుల నుంచి విశేష ప్రశంసలు అందుకుంది. అంతేకాకుండా రెండు నేషనల్ అవార్డులను సొంతం చేసుకుంది. దీంతో నెక్స్ట్ పార్ట్ పై అంచనాలు మరింత పెరిగాయి. తొలి భాగం ఘనవిజయం సాధించడంతో సీక్వెల్‌పై…

Read more

‘రామాయణం’ మ్యూజికల్ జర్నీ ప్రారంభం.. శ్రీరాముడి భక్తి భావాన్ని చాటే ‘జై జై రామ్’ రిలీజ్

‘రామాయణం’ మేకర్స్ ఈ చిత్రంలోని తొలి పాట ‘జై జై రామ్’ తెలుగు వెర్షన్‌ను విడుదల చేశారు. దీంతో సినిమా మ్యూజికల్ జర్నీకి శ్రీకారం చుట్టారు. ఈ పాటకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు. రాకేందు మౌళి తెలుగు సాహిత్యం అందించగా దీపాలి సహాయ్, రాఘవ్ కౌశిక్ పాడారు. శ్రీరాముడిని స్మరిస్తూ రూపొందిన ఈ పాటలో ఆధ్యాత్మిక భావాన్ని, సినిమాటిక్ సౌండ్‌తో ప్రజెంట్ చేశారు. శ్రీరాముడి కరుణ, ధర్మాన్ని పాట సాహిత్యం ప్రతిబింబిస్తుంది. పదే పదే వినిపించే ‘జై జై రామ్’ అనే నామస్మరణ ఈ పాటకు భక్తి భావాన్ని అందిస్తుంది. ఫిల్మ్‌మేకర్, ప్రొడ్యూసర్ నమిత్ మల్హోత్రా మాట్లాడుతూ: “శ్రీరాముడు ‘రామాయణం’కు హృదయం. తరతరాలుగా జీవితంలోని ప్రతి దశలో మనం ఆయనను మార్గదర్శిగా…

Read more

డైరెక్టర్ విజన్ ను నమ్మే ప్రభాస్ లాంటి స్టార్ దొరకడం నా అదృష్టం – డైరెక్టర్ నాగ్ అశ్విన్

రెబెల్ స్టార్ ప్రభాస్ తో కల్కి 2898ఎడి సినిమా రూపొందించి బాక్సాఫీస్ సక్సెస్ తో పాటు రెండు నేషనల్ అవార్డ్స్ అందుకున్నారు డైరెక్టర్ నాగ్ అశ్విన్. ఈ సందర్భంగా తన సంతోషాన్ని పంచుకున్న నాగ్ అశ్విన్..డైరెక్టర్ విజన్ ను నమ్మే ప్రభాస్ లాంటి స్టార్ దొరకడం తన అదృష్టమని తెలిపారు. అక్టోబర్ నుంచి కల్కి సీక్వెల్ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తామని, వచ్చే ఏడాది జూన్ కల్లా షూటింగ్ మొత్తం కంప్లీట్ చేయాలనుకుంటున్నామని నాగ్ అశ్విన్ చెప్పారు. ఈ సారి భారీ స్కేల్ లో తొలి చిత్రానికి మించిన ఎమోషన్స్ తో కల్కి 2 ఉంటుందని ఆయన వెల్లడించారు. 2024లో రిలీజైన కల్కి 2898ఎడి మూవీ ప్రభాస్ కు మరో భారీ విజయాన్ని అందించింది…

Read more