Skip to content

మౌర్య‌, త‌న్వి హీరో హీరోయిన్లుగా మీరా ప్రొడ‌క్ష‌న్స్ ప్రొడ‌క్ష‌న్ నెం.1 లాంఛ‌నంగా ప్రారంభం

మీరా ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై మౌర్య సిద్ధ‌వ‌రం, త‌న్వి ఆకాంక్ష హీరో హీరోయిన్లుగా రూపొందుతోన్న చిత్రం శ‌నివారం లాంఛ‌నంగా పూజా కార్య‌క్ర‌మాల‌తో ప్రారంభ‌మైంది. హైద‌రాబాద్ రామానాయుడు స్టూడియోస్‌లో జ‌రిగిన ఈ కార్య‌క్ర‌మానికి సినీ ప‌రిశ్ర‌మ‌కు చెందిన ప‌లువురు ప్ర‌ముఖులు హాజ‌ర‌య్యారు. ముహూర్త‌పు స‌న్నివేశానికి ఏస్ ప్రొడ్యూస‌ర్ అల్లు అర‌వింద్ క్లాప్ కొట్ట‌గా..అల్లు స్నేహ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. యంగ్ ప్రొడ్యూస‌ర్ బ‌న్నీ వాస్ స్క్రిప్ట్‌ను అందించారు. ఈ సంద‌ర్భంగా... నిర్మాత సందీప్ రామినేని(శాండి) మాట్లాడుతూ ‘‘మా బ్యానర్‌లో ప్రొడ‌క్ష‌న్ నెం.1 మూవీగా రాబోతోన్న ఈ సినిమా ఔట్ అండ్ ఔట్ ఎంట‌ర్‌టైన‌ర్‌. డైరెక్ట‌ర్ గీత సి.శేఖ‌ర్‌ ఫ‌న్‌ ఎంట‌ర్‌టైనింగ్ కంటెంట్‌తో సినిమాను రూపొందిస్తూనే ఓ ఎమోష‌న‌ల్ ట‌చ్‌తో ఉండేలా స్క్రిప్ట్‌ను రెడీ చేశారు…

Read more

శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న “సర్కారు బాయి” సినిమా

- హీరో శ్రీరామ్ నిమ్మల బర్త్ డే పోస్టర్ రిలీజ్ శ్రీరామ్ నిమ్మల, వర్షిక హీరో హీరోయన్స్ గా నటిస్తున్న సినిమా "సర్కారు బాయి". ఈ చిత్రాన్ని డెక్కన్ ఫిలింస్ సమర్ఫణలో ప్రొడ్యూసర్ తుమ్మల ప్రఫుల్ రాం రెడ్డి నిర్మిస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణ ప్రాంతంలో జరిగిన వాస్తవ ఘటనల ఆధారంగా దర్శకుడు లారా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. అప్పటి తెలంగాణ సమాజాన్ని ప్రతిబింబిస్తూ నీటి సమస్యలు, కుల వివక్ష, అణగారిన వర్గాల జీవిత పోరాటం వంటి అంశాలను దర్శకుడు లారా కళ్లకు కట్టినట్లు తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ కు హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది. ఈ రోజు హీరో శ్రీరామ్ నిమ్మల…

Read more

నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతున్న “బాహుబలి ది టార్చ్ బేరర్”

-'బాహుబలి' కోసం ప్రభాస్ పడిన శ్రమ, అంకితభావం, కష్టాన్ని ప్రశంసిస్తున్న నెటిజన్స్ ఇండియన్ సినిమా బాక్సాఫీస్ వద్ద కొత్త చరిత్ర సృష్టించింది బాహుబలి. బాహుబలి ది బిగినింగ్, బాహుబలి ది కన్ క్లూజన్ చిత్రాలు రికార్డ్ స్థాయి వసూళ్లు సాధించి మరే సినిమా అందుకోలేని బెంచ్ మార్క్ క్రియేట్ చేశాయి. బాహుబలిగా రెబల్ స్టార్ ప్రభాస్ ప్రపంచస్థాయిలో కీర్తి ప్రతిష్టలు సంపాదించుకున్నారు. ఈ పేరు, గుర్తింపు ఊరికే రాలేదని బాహుబలి మేకింగ్ డాక్యుమెంటరీ బాహుబలి ది టార్చ్ బేరర్ చూస్తే తెలుస్తోంది. బాహుబలి కోసం ప్రభాస్ పడిన శ్రమ, ఈ సినిమా కోసం తన కెరీర్ నే పణంగా పెట్టిన అంకితభావం, కష్టం చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా ద్వారా ఆయనపై ప్రశంసల…

Read more

నటుడు మహేష్ యాదవ్ పుట్టినరోజు స్పెషల్ ఇంటర్వ్యూ

మహేష్ యాదవ్ నల్గొండ జిల్లా అడవిదేవులపల్లి గ్రామానికి చెందిన నటుడు, సినిమా పట్ల ఆసక్తితో ఎలా అయినా సరే నడుడు అవ్వాలని చేసే ప్రయత్నల్లో అనుకోకుండా దర్శకుడు తరుణ్ భాస్కర్ ను కలవడం జరిగింది. మహేష్ యాదవ్ లోని నడుడిని గుర్తించిన తరుణ్ భాస్కర్ ఈనగరానికి ఏమైంది సినిమాలో ల్యాబ్ అసిస్టెంట్ పాత్ర ఇవ్వడం జరిగింది. ఆ పాత్ర సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది, అక్కడినుండి మహేష్ యాదవ్ నట ప్రస్థానం ప్రారంభం అయ్యింది. కీడాకోల సినిమాలో సత్తి (పొలిటిషియన్ ), ఓం శాంతి శాంతి, ప్రేమంటే, భామకలాపం, సత్తిగాని రెండెకరాలు, రాజుగాడు, నన్నుదోచు కుందువతే, అద్భుతం, జగమెమాయ, భీమ్లానాయక్, స్కై ల్యాబ్, అదర్వ, శభరి, ఇంటింటిరామాయణం, ఉప్పుకప్పురంబు , త్రిబనదారి…

Read more

హీరో నివీన్ పాలీ, డైరెక్టర్ అల్ఫోన్స్ పుత్రన్ క్రేజీ కాంబో కొత్త సినిమాకు “విజయం” టైటిల్ ఖరారు

హీరో నివీన్ పాలీ, డైరెక్టర్ ఆల్ఫోన్స్ పుత్రన్ కాంబోకు పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ ఉంది. వీరు కలిసి చేసిన నేరం, ప్రేమమ్ చిత్రాలు ఘన విజయాలు సాధించాయి. ఇలాంటి క్రేజీ కాంబో 12 ఏళ్ల తర్వాత కలిసి సినిమా చేస్తున్నారంటే అంచనాలు ఏ స్థాయిలో ఉంటాయో అర్థం చేసుకోవచ్చు. ఈ అంచనాల మధ్య నివీన్ పాలీ, ఆల్ఫోన్సో పుత్రన్ కొత్త సినిమాకు "విజయం" అనే టైటిల్ అనౌన్స్ చేశారు. ఈ సినిమాను సినీ హోలిక్స్, పాలీ జూనియర్ పిక్చర్స్ బ్యానర్స్ పై టాన్సన్ టోనీ, సునీల్ రమది నిర్మిస్తున్నారు. కేరళ ఎర్నాకుళంలోని పద్మ థియేటర్ లో అభిమానుల సందడి మధ్య "విజయం" సినిమా టైటిల్ అనౌన్స్ మెంట్ వీడియోను రిలీజ్ చేశారు…

Read more

‘హే చికీతా’ చిత్రం పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను – నిర్మాత సి. కళ్యాణ్

అమరావతి మూవీ మేకర్స్, సుందరకాండ మోషన్ పిక్చర్స్ ఎల్ఎల్‌పి బ్యానర్ల మీద ఎన్. అశోక ఆర్ఎన్ఎస్, ‘గరుడవేగ’ అంజి సంయుక్తంగా నిర్మించిన చిత్రం ‘హే చికీతా’. ఈ మూవీకి ధన్ రాజ్ లెక్కల దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో అభినవ్ మణికంఠ, దివిజ, తన్మయి కుషి ముఖ్య పాత్రలను పోషించారు. ఈ మూవీని జూలై 24న విడుదల చేయబోతోన్నారు. ఈ క్రమంలో శనివారం నాడు టీజర్‌ను ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కె.కె. సెంథిల్ కుమార్, జి. నాగేశ్వర్ రెడ్డి రిలీజ్ చేశారు. ఈ మేరకు నిర్వహించిన టీజర్ లాంచ్ ఈవెంట్‌‌కి ప్రముఖ నిర్మాతలు సి.కళ్యాణ్, దామోదర్ ప్రసాద్, రామసత్య నారాయణ, ప్రముఖ దర్శకులు నాగేశ్వర్ రెడ్డి, దశరథ్ వంటి వారు ముఖ్య అతిథులుగా విచ్చేశారు…

Read more

‘లూయిస్ వ్యూట్టన్’లో రాజ్ దాసిరెడ్డి సందడి!!

మారుతి "భద్రం బి కేర్ ఫుల్" ఫేమ్ రాజ్ దాసిరెడ్డి... ప్రపంచప్రఖ్యాత ఫ్యాషన్ హౌస్ "లూయిస్ వ్యూట్టన్'లో సందడి చేశారు. హ్యాండ్ బ్యాగ్స్, షూస్ మొదలుకుని జ్యువెలరీ వరకు పలు రకాల అలంకార ఉత్పత్తులకు ప్రపంచ ప్రసిద్ధి చెందిన "లూయిస్ వ్యూట్టన్', హైదరాబాద్ స్టోర్ ను సందర్శించడం తనకెంతో సంతోషానించ్చిందని దాసిరెడ్డి పేర్కొన్నారు. 172 సంవత్సరాల సుదీర్ఘ ఘన చరిత్ర కలిగిన "లూయిస్ వ్యూట్టన్' అనేక పర్యాయాలు ప్రపంచంలోనే అత్యంత విలాసవంతమైన ఫ్యాషన్ బ్రాండ్ గా గుర్తింపు పొందింది. "లూయిస్ వ్యూట్టన్' ప్రోడక్ట్ ధరించడాన్ని పెద్ద పెద్ద సెలబ్రిటీస్ సైతం గర్వంగా, ప్రత్యేకంగా ఫీలవుతుంటారు. రాజ్ దాసిరెడ్డి తదుపరి చిత్రం త్వరలో అనౌన్స్ కాకుంది. ఈ చిత్రం హిందీ, తెలుగు భాషల్లో తెరకెక్కనుంది!!

Read more

“ఆలోచన” చిత్రం ఫస్ట్ లుక్ ను విడుదల చేసిన పద్మశ్రీ మురళి మోహన్

పి.ఎస్.జె ఫిలిమ్స్ కో బ్యానర్ లో ప్రదీప్ కుమార్, శ్రీనివాస్ గుండబోయిన నిర్మించిన చిత్రం "ఆలోచన". సీనియర్ నటులు జి.వి.నారాయణ రావు, ప్రసాద్ బాబు, నరసింహరాజు, రాజన్ హరి , మహర్షి రాఘవ, జయలలిత మరియు నూతన పరిచయం సీనియర్ నటుడు సుధాకర్ గారి అబ్బాయి బెన్నీ సుధాకర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సురేందర్ చాచా కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం వహించారు. ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ ను పద్మశ్రీ మురళి మోహన్ గారు విడుదల చేశారు. ఈ సందర్భంగా మురళి మోహన్ గారు మాట్లాడుతూ ... అద్భుతమైన నటుల కాంబినేషన్ తో స్నేహం పై ఒక మంచి కాన్సెప్ట్ తో ఆలోచన చేశారని మంచి…

Read more

హృదయాలను తాకే భావోద్వేగ చిత్రం ‘గాసిప్’

ప్రస్తుత సోషల్ మీడియా కాలంలో నిజానిజాలు తెలుసుకోకుండా పుకార్లను నమ్మడం ఎంత ప్రమాదకరమో తెలియజేసే చిత్రమే ‘గాసిప్’. దర్శకుడు వైభవ్ కౌండిన్య సమాజంలో ప్రతి ఒక్కరికీ సంబంధించిన అంశాన్ని ఎంచుకుని, ఆలోచింపజేసే విధంగా తెరకెక్కించారు. అజంతా (రాశి సింగ్) జీవితంలో జరిగిన ఒక చిన్న సంఘటన ఎలా పెద్ద గాసిప్‌గా మారి ఆమె కుటుంబాన్ని, వ్యక్తిగత జీవితాన్ని ప్రభావితం చేస్తుందనే అంశాన్ని సినిమా ప్రధానంగా చూపిస్తుంది. కథలోని భావోద్వేగాలు, పాత్రల సహజత్వం ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. రాశి సింగ్ తన పాత్రలో అద్భుతంగా నటించి సినిమాకు ప్రధాన బలంగా నిలిచారు. ముఖ్యంగా ఎమోషనల్ సన్నివేశాల్లో ఆమె నటన ప్రేక్షకులను కదిలిస్తుంది. మహేష్ యడ్లపల్లి, రవి వర్మ, విజయ్ అదిరాజు తమ పాత్రలకు పూర్తి న్యాయం…

Read more

‘నాగబంధం’ నుంచి ‘వీరనాగ’ సాంగ్ రిలీజ్

'నాగబంధం – ది సీక్రెట్ ట్రెజర్’ చిత్రం అద్భుతమైన ప్రమోషనల్ కంటెంట్ తో భారీ అంచనాలను పెంచింది. దర్శకుడు అభిషేక్ నామా అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ ఎపిక్ అడ్వెంచర్ థ్రిల్లర్‌లో విరాట్ కర్ణ హీరోగా నటించారు. నిక్ స్టూడియోస్, అభిషేక్ పిక్చర్స్ బ్యానర్లపై కిషోర్ అన్నపురెడ్డి, నిశిత నాగిరెడ్డి నిర్మించిన ఈ చిత్రంలో నభా నటేష్, ఐశ్వర్య మీనన్, జగపతిబాబు, మహేష్ మంజ్రేకర్, మురళీ శర్మ, దక్ష నాగార్కర్ కీలక పాత్రల్లో నటించారు. ఇప్పటికే విడుదలైన టీజర్ ట్రైలర్ సాంగ్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఈ రోజు మేకర్స్ వీరనాగ సాంగ్ ని రిలీజ్ చేశారు. 'వీరనాగ' పాట నాగ సాధువుల ఆధ్యాత్మిక తాండవాన్ని అద్భుతంగా ఆవిష్కరించింది. శ్రీహర్ష ఈమని…

Read more