Skip to content

బర్క్‌లీ స్కూల్‌ ఆఫ్‌ మ్యూజిక్‌ స్కూల్‌ ఎన్‌సెంబల్‌ ఎక్సెలన్స్‌ అవార్డును ఎంపికైన సుకృతి వేణి బండ్రెడ్డి!

పుష్ప, పుష్ప-2 చిత్రంతో అంతర్జాతీయ స్థాయిలో దర్శకుడిగా గుర్తింపు పొంది. ఇటీవల జాతీయ అవార్డుల్లో ఉత్తమ స్క్రీన్‌ప్లే రచయితగా ఘనత పొందిన ప్రముఖ దర్శకుడు సుకుమార్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే సుకుమార్‌ బాటలోనే ఆయన తనయురాలు సుకృతి వేణి బండ్రెడ్డి కూడా విభిన్న బాటలో పయనిస్తున్నారు. 2024 సంవత్సరానికి జాతీయ ఉత్తమ బాల నటిగా 'గాంధీ తాత చెట్టు' చిత్రానికి గాను అవార్డు సాధించిన సుకృతి వేణి ఇప్పుడు మరో అరుదైన ఘనతను కైవసం చేసుకుంది. అమెరికాలోని బోస్టన్‌లో ఉండే అంతర్జాతీయ బర్క్‌లీ స్కూల్‌ ఆఫ్‌ మ్యూజిక్‌ స్కూల్‌లో సంగీత విభాగంలో ఎన్‌సెంబల్‌ ఎక్సెలన్స్‌ అవార్డును ఎంపికై ఫుల్‌ స్కాలర్‌షిప్‌ను సొంతం చేసుకుంది. Boston లోని Berklee College…

Read more

రైతు బిడ్డ నుంచి ‘త్రికాల సినిమాటిక్ యూనివర్స్’ సృష్టికర్తగా.. మణి తెల్లగూటి

'త్రికాల’ ద‌ర్శ‌కుడికి జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌ల వెల్లువ‌ కలలు కనడం సులభమే... కానీ ఆ కలలకు రెక్కలొచ్చి వెండితెరపై విశ్వరూపం దాల్చాలంటే అద్భుతమైన పట్టుదల, సాంకేతిక ప్రతిభ, ఆత్మవిశ్వాసం ఉండాలి. ఆ మూడింటినీ కలబోసుకున్న అరుదైన ప్రతిభామూర్తి మణి తెల్లగూటి. పచ్చని పొలాల మధ్య ఎదిగిన ఒక సాధారణ రైతు బిడ్డ... నేడు టాలీవుడ్‌ను త్రికాలాల వైపు తిప్పి చూసేలా చేసిన దర్శకుడిగా మారడం వెనుక ఒక గొప్ప తపస్సు ఉంది. ప్రొజెక్టర్ గదిలో వినిపించే రొద, వెండితెరపై ప్రసరించే వెలుగులో తన భవిష్యత్తును వెతుక్కున్న ఆ కుర్రాడు... నేడు 'త్రికాల సినిమాటిక్ యూనివర్స్'తో శభాష్ అనిపించుకుంటున్నారు. ప్రొజెక్టర్ వెలుగు నుంచి ప్రొడక్షన్ ఛైర్ వరకు.. ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి జిల్లా, చింతాపూడి గ్రామంలో ఒక…

Read more

ఎర్ర చీర దర్శకులు సుమన్ బాబు కి పితృవియోగం

ఎర్ర చీర సినిమా దర్శకులు నటులు సుమన్ బాబు గారి తండ్రిగారైన చెరువుపల్లి వెంకటసుబ్బయ్య గారు ఈ ఉదయం తెల్లవారుజామున.. హార్ట్ స్ట్రోక్ తో నెల్లూరు లోని వారి స్వగృహమునందు పరమపదించారు...గత కొన్ని సంవత్సరాలుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న శ్రీ సుబ్బయ్య గారు గురువారం రోజు తెల్లవారుజామున కాలం చేశారు. ఈరోజు మధ్యాహ్నం మూడు గంటల తర్వాత ఆయన అంత్యక్రియలు నెల్లూరులోని వారి స్వగ్రామంలో జరుగుతాయి.

Read more

‘అగధ’ చూసి కన్నీళ్లు పెట్టుకున్నాను: కామాక్షి భాస్కర్ల

‘అగధ’ కోసం బుద్ధిజం పుస్తకాల్ని చదివాను. బ్లాక్ మ్యాజిక్ గురించి తెలుసుకున్నాను - కామాక్షి భాస్కర్ల శ్యాం ప్రసాద్ రెడ్డి గారి లాంటి పెద్ద నిర్మాత నన్ను అనుష్కతో పోల్చడం ఆనందంగా అనిపించింది - కామాక్షి భాస్కర్ల కామాక్షి భాస్కర్ల ఎంచుకునే సినిమాలు, కథలు, సాధిస్తున్న విజయాల గురించి అందరికీ తెలిసిందే. కంటెంట్ ఓరియెంట్ ప్రాజెక్ట్‌లని చేస్తూ దూసుకుపోతోన్న కామాక్షి భాస్కర్ల రేపు (ఆగస్ట్ 14) ‘అగధ’ అంటూ రాబోతోన్నారు. ఈ సినిమాని శ్రీ ఆదివరాహ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద అజయ్ కేఆర్ సమర్పణలో కాశీ విశాలాక్షి బలుసు నిర్మాణంలో ఎం.ఎస్. రాజు తెరకెక్కించారు. ఈ మూవీలో కామాక్షి భాస్కర్లతో పాటు శ్రవణ్ రెడ్డి, ఉల్కా గుప్తా, జోవికా విజయ్‌కుమార్, భాను చందర్,…

Read more

ట్రెండ్ సెట్టింగ్ ఫాంటసీ థ్రిల్లర్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న “కెరూబ్” సినిమా

సెప్టెంబర్ లో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న "కెరూబ్" మూవీ విహాన్ కార్తీక్, దివ్య విశ్వకర్మ హీరో హీరోయిన్స్ గా నటిస్తున్న సినిమా "కెరూబ్". ఈ చిత్రాన్ని ఖుషి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై ప్రొడ్యూసర్ బాలు బల్లెకారి నిర్మిస్తున్నారు. ఫాంటసీ థ్రిల్లర్ కథతో దర్శకుడు ఎం జె నాయుడు (జీవన్) రూపొందిస్తున్నారు. ఫస్ట్ కాపీ రెడీ చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం సెన్సార్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. సెప్టెంబర్ లో "కెరూబ్" చిత్రాన్ని గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు తీసుకొచ్చేందుకు దర్శక నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే "కెరూబ్" సినిమా నుంచి రిలీజ్ చేసిన టీజర్ హ్యూజ్ రెస్పాన్స్ తెచ్చుకుంటోంది. తాజాగా రిలీజ్ చేసిన "కెరూబ్" సినిమా ఫస్ట్ లుక్…

Read more

‘ఇరుముడి’ మీ అందరికీ కచ్చితంగా నచ్చుతుంది: మాస్ మహారాజా రవితేజ

-మాస్ మహారాజా రవితేజ, శివ నిర్వాణ, మైత్రీ మూవీ మేకర్స్ ‘ఇరుముడి’ ఎమోషన్స్ రోలర్ కోస్టర్ ట్రైలర్ లాంచ్ మాస్ మహారాజా రవి తేజ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'ఇరుముడి' చిత్రం ఆగస్టు 21న థియేటర్లలో విడుదల కానున్న నేపథ్యంలో అంచనాలను పెరుగుతున్నాయి. శివ నిర్వాణ దర్శకత్వంలో, మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రం గ్లింప్స్ పాటలతో ఇప్పటికే చాలా ఆసక్తిని రేకెత్తించింది. ఇప్పుడు చిత్ర నిర్మాతలు తెలుగు, తమిళ భాషలలో విడుదల చేసిన థియేట్రికల్ ట్రైలర్‌తో ఉత్సాహాన్ని మరో మెట్టు పైకి తీసుకెళ్లారు. ట్రైలర్‌తో సినిమా కథలోని ప్రధాన అంశంపై స్పష్టత వచ్చింది. రవితేజ ఇందులో మధ్యతరగతి కుటుంబానికి చెందిన వ్యక్తిగా కనిపించారు. భార్య, కూతురిని ఎంతో ప్రేమగా చూసుకునే…

Read more

‘సిగ్మా’ నుంచి ఓలమ్మో వగలాడి సాంగ్‌ రిలీజ్‌

లైకా ప్రొడక్షన్స్ అధినేత సుభాస్కరన్ నిర్మిస్తున్న 'సిగ్మా' సినిమా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. దర్శకుడిగా జేసన్ సంజయ్ అరంగేట్రం చేస్తున్న ఈ చిత్రంలో సందీప్ కిషన్ హీరోగా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ సింగిల్ సిగ్మా స్టయిల్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. తాజాగా మేకర్స్ ఓలమ్మో వగలాడి సాంగ్ రిలీజ్ చేశారు. తమన్ ఎనర్జిటిక్ నెంబర్ ని కంపోజ్ చేశారు. యువన్ శంకర్ రాజా, సంజనా దివాకర్ కల్మంజే కలిసి ఆలపించిన ఈ పాట విన్నవెంటనే కనెక్ట్ అవుతుంది. కృష్ణ చైతన్య సాహిత్యం క్యాచిగా వుంది. ఈ పాటలో సందీప్ కిషన్, ఫారియా అబ్దుల్లా మధ్య కెమిస్ట్రీ ఆకట్టుకునేలా ఉంది. ఇద్దరి మధ్య ఉన్న ఎనర్జీ, స్క్రీన్ ప్రెజెన్స్ పాటకు…

Read more

“రోమాంచకం” సినిమా టైటిల్ సాంగ్ రిలీజ్

సెప్టెంబర్ 3న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న మూవీ బ్లాక్ బస్టర్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా సమర్పణలో భద్రకాళీ పిక్చర్స్ బ్యానర్ నిర్మిస్తున్న సినిమా "రోమాంచకం". సుమంత్ ప్రభాస్, అనంతిక సనిల్ కుమార్ జంటగా నటిస్తున్న ఈ చిత్రాన్ని ప్రణయ్ రెడ్డి వంగా నిర్మిస్తున్నారు. నూతన దర్శకుడు వేణుగోపాల్ రెడ్డి రూపొందిస్తున్నారు. ఈ సినిమా సెప్టెంబర్ 3న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. మరోవైపు ఈ సినిమా మ్యూజికల్ ప్రమోషన్స్ సక్సెస్ ఫుల్ గా కొనసాగుతున్నాయి. ఇప్పటికే "రోమాంచకం" సినిమా నుంచి రిలీజ్ చేసిన 'రాధా రమణ' సాంగ్ కు మ్యూజిక్ లవర్స్ నుంచి హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ…

Read more

‘పళ్ళ బురుసు’ సినిమాని ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారు: దర్శకుడు ఉదయ్ చౌహాన్

అన్నపూర్ణ స్టూడియోస్, ఎపిక్ స్టూడియోస్ సంయుక్తంగా సమర్పిస్తూ నిర్మిస్తున్న చిత్రం పళ్ళబురుసు. ఉదయ్ చౌహాన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్, ప్రజ్వల్ యాద్మా, గోమతి రెడ్డి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ చేసిన ప్రమోషనల్ కంటెంట్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది, ‘పళ్ళ బురుసు’ ఆగస్టు 14న థియేటర్లలో గ్రాండ్ రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా దర్శకుడు ఉదయ్ చౌహాన్ విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు. మీ నేపథ్యం గురించి చెప్పండి? ‘పళ్ళ బురుసు’ ఎలా మొదలైంది? మాది మహబూబ్‌నగర్ జిల్లా. అమ్మానాన్న ఇద్దరూ ప్రభుత్వ ఉద్యోగులు. నాకు చిన్నప్పటి నుంచే సినిమాలంటే చాలా ఇష్టం. ఇంట్లో డాక్టర్ చదవని చెప్పారు. కానీ సినిమాలపై…

Read more

“హైవాన్” సినిమా టీజర్ రిలీజ్

సెప్టెంబర్ 11న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న మూవీ అక్షయ్ కుమార్, సైఫ్ అలీఖాన ప్రధాన పాత్రల్లో ప్రముఖ దర్శకుడు ప్రియదర్శన్ రూపొందిస్తున్న సినిమా "హైవాన్". సరికొత్త థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని కేవీఎన్ ప్రొడక్షన్స్, తెస్పియన్ ఫిలింస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ ప్రెస్టీజియస్ మూవీతో ఫస్ట్ టైమ్ నెగిటివ్ క్యారెక్టర్ లో నటిస్తున్నారు అక్షయ్ కుమార్. "హైవాన్" సినిమా సెప్టెంబర్ 11న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వచ్చేందుకు రెడీ అవుతోంది. ఈ రోజు ఈ చిత్ర టీజర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. "హైవాన్" మూవీ టీజర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. మూవీలోని ప్రధాన పాత్రధారులు సైఫ్ అలీ ఖాన్, అక్షయ్ కుమార్ క్యారెక్టర్స్ ను టీజర్…

Read more