Skip to content

మన శంకర వర ప్రసాద్ గారు బ్లాక్‌బస్టర్ విజయంపై చిరంజీవి గారి ఎమోషనల్ మెసేజ్

ప్రపంచవ్యాప్తంగా 300 కోట్ల గ్రాస్ సాధించిన 'మన శంకర వర ప్రసాద్ గారు' చిత్రం ఘన విజయం నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి గారు ఎమోషనల్ మెసేజ్ షేర్ చేశారు. అత్యంత వేగంగా 300 కోట్ల మార్క్‌ను చేరిన తెలుగు చిత్రంగా మన శంకర వర ప్రసాద్ గారు ఘనత సాధించింది. ఈ చిత్రం ఉత్తర అమెరికాలో 3 మిలియన్ డాలర్ల మార్కును కూడా అధిగమించి, చిరంజీవి, దర్శకుడు అనిల్ రావిపూడి ఇద్దరికీ అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. 8వ రోజు అద్భుతమైన వసూళ్లు నమోదు చేసి, భారీ బుకింగ్‌లతో 9వ రోజున మరింత జోరుని కొనసాగుస్తోంది. ఇప్పటికే అనేక రికార్డులను బద్దలు కొట్టిన ఈ చిత్రం, ఇప్పుడు మరిన్ని మైలురాళ్ల దిశగా…

Read more

కంప్లీట్ ఎంటర్ టైనర్ “క్రేజీ కల్యాణం” మూవీ నుంచి వెర్సటైల్ యాక్టర్ వీకే నరేష్ బర్త్ డే పోస్టర్ రిలీజ్

నరేష్ వీకే, అనుపమ పరమేశ్వరన్, తరుణ్ భాస్కర్, రాజ్ వెడ్స్ రాంబాయి ఫేమ్ అఖిల్ ఉడ్డెమారి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా "క్రేజీ కల్యాణం". ఈ చిత్రాన్ని యారో సినిమాస్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెం. 2గా ప్యాషనేట్ ప్రొడ్యూసర్ బూసమ్ జగన్ మోహన్ రెడ్డి నిర్మిస్తున్నారు. దర్శకుడు బద్రప్ప గాజుల రూపొందిస్తున్నారు. ఈ రోజు వెర్సటైల్ యాక్టర్ వీకే నరేష్ బర్త్ డే సందర్భంగా ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ పోస్టర్ లో పర్వతాలు అనే పాత్రలో ట్రెడిషనల్ గా వీకే నరేష్ ఆకట్టుకుంటున్నారు. పెళ్లి చుట్టూ సాగే ఆసక్తికరమైన కథతో కంప్లీట్ ఎంటర్ టైన్ మెంట్ తో సాగే చిత్రమిది. తెలంగాణలోని…

Read more

400 కోట్లకు పైగా భారీ బడ్జెట్ తో “మా వందే”

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బయోపిక్ ను "మా వందే" టైటిల్ తో సిల్వర్ కాస్ట్ క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు ప్రొడ్యూసర్ వీర్ రెడ్డి.ఎం. ఈ చిత్రంలో నరేంద్ర మోదీ పాత్రలో మలయాళ స్టార్ హీరో ఉన్ని ముకుందన్ నటిస్తున్నారు. ఎన్నో పోరాటాల కన్నా తల్లి సంకల్పం గొప్పదనే సందేశాన్నిస్తూ ప్రధాని మోదీ జీవితాన్ని యదార్థ ఘటనల ఆధారంగా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా తెరకెక్కిస్తున్నారు దర్శకుడు క్రాంతికుమార్.సీహెచ్. ప్రధాని మోదీ వ్యక్తిగత, రాజకీయ జీవితంలోని విశేషాలన్నీ ఎంతో సహజంగా "మా వందే" సినిమాలో చూపించబోతున్నారు. ఈ సినిమా అంతర్జాతీయ ప్రమాణాలతో, అత్యున్నత సాంకేతిక విలువలు, వీఎఫ్ఎక్స్ తో రూపొందుతోంది. "మా వందే" చిత్రాన్ని పాన్ ఇండియా భాషలతో పాటు ఇంగ్లీష్ లోనూ…

Read more

శుభకృత్ నామ సంవత్సరం’ అద్భుతమైన కంటెంట్ ఉన్న సినిమా : నరేష్ విజయ్

నవరసరాయ డాక్టర్ నరేష్ విజయ్ కృష్ణ ప్రధాన పాత్రలో రూపొందుతున్న చిత్రం 'శుభకృత్ నామ సంవత్సరం'. ఎస్‌ఎస్‌ సజ్జన్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఎస్వి పిక్చర్స్, అవిష్క డ్రీ ప్రొడక్షన్ బ్యానర్స్ పై డిఆర్ విశ్వనాథ్ నాయక్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం గ్లింప్స్ లాంచ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. గ్లిమ్స్ లాంచ్ ఈవెంట్లో నవరసరాయ డాక్టర్ నరేష్ విజయ్ కృష్ణ మాట్లాడుతూ.. ఈ వేడుకకు విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు. మా కుటుంబంలో సగమైన ఫ్యాన్స్ కి పేరుపేరునా కృతజ్ఞతలు. మా కుటుంబంలో ఏదైనా సరే మాతో వచ్చి నిలబడే ఫ్యాన్స్ ని కృష్ణ గారు మాకు ఇచ్చి వెళ్లారు. రామోజీరావు గారు జంద్యాల గారు నాకు ఒక…

Read more

#VT15 టైటిల్ కొరియన్ కనకరాజు

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మోస్ట్ ఎవైటెడ్ మూవీ#VT15, టాలెంటెడ్ డైరెక్టర్ మేర్లపాక గాంధీ డైరెక్షన్‌లో, UV క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లపై భారీ బడ్జెట్‌తో గ్రాండ్‌గా రూపొందుతోంది. హర్రర్, కామెడీని క్రాస్-కల్చరల్ ట్విస్ట్‌తో బ్లెండ్ చేస్తూ VT15 ఇండియన్, కొరియన్ బ్యాక్ డ్రాప్ లో ఉండబోతోంది. ఈ చిత్రంలో వరుణ్ తేజ్ ఇంతకు ముందు చేయని డిఫరెంట్ క్యారెక్టర్ లో కనిపించబోతున్నారు. వరుణ్ తేజకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ, మేకర్స్ ఈ సినిమా టైటిల్‌ను థ్రిల్‌ అందించే గ్లింప్స్ ద్వారా రిలీజ్ చేశారు. టీజర్ కొరియన్ పోలీసులు సత్యను క్రూరంగా కొట్టి ఇంటరాగేషన్ చేయడంతో టీజర్ ప్రారంభమవుతుంది. తను అనంతపురంలోని పెనుకొండకు చెందిన ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్ అని చెబుతాడు. అప్పుడు…

Read more

‘మన శంకర వర ప్రసాద్ గారు’ 300 కోట్లకు చేరువ

మెగాస్టార్ చిరంజీవి సంక్రాంతి విన్నర్ 'మన శంకర వర ప్రసాద్ గారు' రికార్డులను బద్దలు కొడుతూ దూసుకుపోతోంది. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రం, మొదటి వారం మొత్తం అద్భుతమైన వసూళ్లను కొనసాగించడమే కాకుండా, బ్రేక్-ఈవెన్ సాధించడంతో సహా అనేక మైలురాళ్లను అధిగమించింది. భారీ ఓపెనింగ్ తర్వాత, ఈ చిత్రం ప్రతిరోజూ పెద్ద మొత్తాలను వసూలు చేస్తూ, నిన్న ఒక్కరోజే 31 కోట్ల రూపాయలను రాబట్టింది. ప్రపంచవ్యాప్తంగా మొత్తం వసూళ్లు ఇప్పుడు 292 కోట్లకు చేరుకున్నాయి, దీంతో 'MSG' ప్రతిష్టాత్మక 300 కోట్ల క్లబ్‌కు చేరువలో ఉంది, ఈ మైలురాయిని ఈ రోజు సులభంగా దాటుతుందని భావిస్తున్నారు. ఈ చిత్రం 'సంక్రాంతికి వస్తున్నాం' చిత్రాన్ని అధిగమించి, అనిల్ రావిపూడి కెరీర్‌లో అత్యధిక…

Read more

‘చీన్ టపాక్‌ డుం డుం’ ఘనంగా ప్రారంభం

‘శుభం’ ఫేమ్ గవిరెడ్డి శ్రీను హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘చీన్ టపాక్‌ డుం డుం'. అధికారికంగా పూజా కార్యక్రమంతో ప్రారంభమైంది. అమెజాన్ ప్రైమ్ హిట్ సిరీస్‌లు కుమారి శ్రీమతి, శుభం ద్వారా నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న రచయిత-నటుడు గవిరెడ్డి శ్రీను కెరీర్‌లో కొత్త అధ్యాయానికి ఈ మూవీ శ్రీకారం చుట్టింది. ఆద్యంతం వినోదాత్మక చిత్రంగా ‘చీన్ టపాక్‌ డుం డుం' తెరకెక్కనుందని టైటిల్‌ విన్న ప్రతి ఒక్కరూ ప్రశంసిస్తున్నారు. పూర్తి వినోదాత్మకంగా తెరకెక్కనున్న ఈ చిత్ర ప్రారంభోత్సవం సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖుల సమక్షంలో ఎంతో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి స్టార్ హీరోయిన్ సమంత, దర్శకులు మల్లిడి వశిష్ఠ, గోపిచంద్ మలినేని, నందిని రెడ్డి, బివిఎస్ రవి,…

Read more

‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’కి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది : నిర్మాత సుధాకర్ చెరుకూరి

మాస్ మహారాజా రవితేజ సంక్రాంతి బ్లాక్ బస్టర్ 'భర్త మహాశయులకు విజ్ఞప్తి'. కిషోర్ తిరుమల దర్శకత్వంలో, సుధాకర్ చెరుకూరి ఎస్ఎల్‌వి సినిమాస్ బ్యానర్‌పై నిర్మించిన ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ లో డింపుల్ హయతి, ఆషిక రంగనాథ్ కథానాయికలుగా నటించారు. జనవరి 13న గ్రాండ్‌గా విడుదలైన ఈ సినిమా సంక్రాంతి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుని హౌస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా నిర్మాత సుధాకర్ చెరుకూరి విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు. భర్త మహాశయులకు విజ్ఞప్తి బ్రేక్ ఈవెన్ అయింది కదా.. హ్యాపీగా ఉన్నారా? -చాలా హ్యాపీ. ఆంధ్ర మొత్తం ఆల్మోస్ట్ అయింది. ఇది లాంగ్ వీకెండ్. సోమవారం కూడా హాలిడే. నైజం తో పాటు మిగతా ఏరియాలో…

Read more

మొక్కు తీర్చుకోవడానికి చేస్తున్న పాదయాత్ర: బండ్ల గణేశ్‌

''సంకల్ప యాత్ర.. ఇది రాజకీయ యాత్ర కాదు. దైవ సంకల్పం. దేవుడికి మొక్కుకున్న మొక్కు. దేవుడు నా కోరిక తీర్చినందుకు రుణం తీర్చుకోవడానికి చేస్తున్న యాత్ర'అన్నారు ప్రముఖ సినీ నిర్మాత బండ్ల గణేశ్‌. షాద్‌నగర్‌ నుంచి తిరుమలకు 'సంకల్ప యాత్ర' ప్రారంభించారు బండ్ల గణేశ్‌. ఈ నేపథ్యంలో మీడియా సమావేశంలో నిర్మాత బండ్ల గణేశ్‌ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. సంకల్ప యాత్ర.. ఇది రాజకీయ యాత్ర కాదు. దైవ సంకల్పం. దేవుడికి మొక్కుకున్న మొక్కు. దేవుడు నా కోరిక తీర్చినందుకు ఆయన రుణం తీర్చుకోవడానికి చేస్తున్న యాత్ర. ఇది రాజకీయ యాత్ర కాదు. ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేదు. నా షాద్ నగర్ ప్రజలు, నాకు ఈ స్థాయి ఇచ్చి, నా…

Read more

‘ఆకాశంలో ఒక తార’ చిత్రం నుంచి సాత్విక వీరవల్లి పరిచయం

వైవిధ్య‌మైన సినిమాలు, పాత్ర‌ల‌తో బ‌హు భాషా న‌టుడిగా త‌న‌దైన గుర్తింపు సంపాదించుకున్న స్టార్‌ దుల్క‌ర్ స‌ల్మాన్. కంటెంట్ బేస్డ్ మూవీస్ ప్రేక్ష‌కుల‌పై ఎక్కువ ప్ర‌భావాన్ని చూపుతాయ‌ని ఆయ‌న గ‌ట్టిగా న‌మ్ముతుంటారు. ఆ న‌మ్మ‌కంతో ఆయ‌న చేస్తోన్న మ‌రో డిఫ‌రెంట్ మూవీ ‘ఆకాశంలో ఒక తార‌’. ఈ మూవీ ఫ‌స్ట్ లుక్‌, టీజ‌ర్ అంద‌రినీ ఆక‌ట్టుకోవ‌టంతో పాటు సినిమాపై ఉన్న అంచ‌నాల‌ను మ‌రింత‌గా పెంచాయి. యూనిక్ సినిమాటిక్ ఎప్రోచ్‌, ఇన్నోవేటివ్ స్టోరీ టెల్లింగ్‌తో సినిమాను రూపొందించే డైరెక్ట‌ర్ ప‌వ‌న్ సాధినేని ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. ‘ఆకాశంలో ఒక తార’ చిత్రాన్ని ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ‌లు గీతా ఆర్ట్స్, స్వ‌ప్న సినిమా స‌మ‌ర్ప‌ణ‌లో లైట్ బాక్స్ మీడియా బ్యాన‌ర్‌పై సందీప్ గున్నం, ర‌మ్య గున్నం నిర్మిస్తున్నారు…

Read more