శరవేగంగా నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’
శుభ ముహూర్తంలో డబ్బింగ్ పనులు ప్రారంభం డబ్బింగ్ కార్యక్రమాలలో పాల్గొననున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగు సినీ ప్రియులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'ఉస్తాద్ భగత్ సింగ్' చిత్రం కీలకమైన పోస్ట్ ప్రొడక్షన్ దశలోకి ప్రవేశించింది. శుభ ముహూర్తంలో డబ్బింగ్ పనులు ప్రారంభమయ్యాయి. తన శక్తివంతమైన రచన, మాస్ మెచ్చే సంభాషణలకు పేరుగాంచిన హరీష్ శంకర్ ను అభిమానులు ముద్దుగా 'కల్ట్ కెప్టెన్' అని పిలుస్తారు. ఆ పేరుకి తగ్గట్టుగానే 'ఉస్తాద్ భగత్ సింగ్'ను కల్ట్ చిత్రంగా మలచడానికి శాయశక్తులా కృషి చేస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలను దర్శకుడు హరీష్ శంకర్ వేగంగా ముందుకు తీసుకెళ్తున్నారు. సినిమా అనుభూతిని మరో స్థాయికి తీసుకెళ్లేలా.. ప్రేక్షకుల్ని ఉర్రూతలూగించే, ప్రేక్షకుల చేత ఈలలు వేయించే…
