#RAPO23తో రితేశ్ దేశ్‌ముఖ్ టాలీవుడ్ అరంగేట్రం
ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని తన ప్రతిష్ఠాత్మక చిత్రం #RAPO23 కోసం హీరోగా, దర్శకుడిగా రెండు బాధ్యతలను నిర్వహిస్తున్నారు. ఈ సినిమాను శరవేగంగా తెరకెక్కిస్తున్నారు. రామ్ దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రాన్ని రాపో సినిమాటిక్స్ బ్యానర్‌పై నిర్మాత కృష్ణ పోతినేని భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. బాలీవుడ్‌లో విభిన్నమైన పాత్రలతో తనదైన గుర్తింపు తెచ్చుకున్న రితేశ్ దేశ్‌ముఖ్ #RAPO23తో తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టబోతున్నారు. ‘ఏక్ విలన్’, ‘రైడ్ 2’తో పాటు ఇటీవల బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన ‘రాజా శివాజీ’ వంటి చిత్రాల్లో అద్భుతంగా నటించి ప్రేక్షకులని అలరించారు. #RAPO23 కోసం రామ్ పోతినేని ఈ కథకు, తొలిసారిగా తెరకెక్కిస్తున్న నియో-నాయర్ వరల్డ్ కి మరింత బలాన్ని చేకూర్చేలా నటీనటులు, సాంకేతిక బృందాన్ని ఎంతో జాగ్రత్తగా…
